సిరాన్యూస్, ఇచ్చోడ
బోరిగామలో బీజేపీ నాయకుల ఇంటింటా ప్రచారం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. బిజెపి అధికారంలోకి వస్తేనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి బిజెపి అభ్యర్థి గోడం నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు నారాయణ, శేఖర్, స్వామినాథరెడ్డి, దయాకర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.