sonala:సొనాల రామాలయంలో కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
సొనాల రామాలయంలో కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లంలోని సొనాల‌, కౌట( బి), పొచ్చెర గ్రామాలలో రాములోరి కళ్యాణం ఆయా గ్రామాల్లోని ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సొనాల‌లో జరిగిన కళ్యాణంలో స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తితో మానసిక ప్రశాంతత ఉంటుందని భక్తి మార్గాన్ని అవలంబిస్తే చెడు వ్యసనాలకు దూరం అవుతారన్నారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని పండితులు ఆశీర్వదించారు. ప్రభుత్వ లెక్చరర్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ బలిరాం పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు రామాలయ కమిటీ అధ్యక్షుడు జీవీ రమణతోపాటు స్థానిక ఎంపీపీ తుల శ్రీనివాస్, నేరడిగొండ ఎంపీపీ సజన్లాల్, మాజీ ఆత్మ చైర్మన్ మల్లెపూల శుభాష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ బోథ్‌ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, సోనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల పోత,న్న జిల్లా అధికార ప్రతినిధి పసుల‌ చంటి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు సోనాల గ్రామానికి చెందిన భక్తులు హోంగుండం వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే అన్ని పార్టీల రాజకీయ నాయకులు రాములూరి కళ్యాణానికి రావడంతో రాముడి కళ్యాణం రాజకీయ వేదికగా మారిందని భక్తులు చర్చించుకోవడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *