సిరాన్యూస్, ఖానాపూర్
కరాటే విద్యార్థులకు బహుమతులు ప్రదానం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఏసి స్కూల్ గోసంపల్లి గ్రామంలోని బ్రిలియంట్ స్కూల్ బీర్ నంది గ్రామంలోని వాసు విద్యాలయం, జడ్పీహెచ్ఎస్ కొన్ని రోజుల నుండి కరాటే విద్యను నేర్చుకున్నారు. ఆ విద్యను అనుసరిస్తూ పలు రకాల బెల్టులను (ఎల్లో ఆరెంజ్ గ్రీన్ మెరూన్), జుకోకాయ్ కరాటే కు సంబంధించిన సర్టిఫికెట్స్ ఐడి కార్డులను కరాటే మాస్టర్ మచ్చ మనోహర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ మచ్చ మనోహర్ మాట్లాడుతూ ఖానాపూర్ లోని శ్రీ బాలాజీ రైస్ మిల్ గ్రౌండ్లో కరాటే క్లాసులను ప్రారంభించామన్నారు. ఈ కరాటే చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ ఆరోగ్యానికి, ఆత్మరక్షణకు, మనోధైర్యానికి ఎంతో అవసరమని తెలుపటం జరిగింది. కరాటేలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బీర్ నంది జెడ్ పి హెచ్ ఎస్ లో ఎం, నాగ చైతన్య మెరూన్ సెకండ్ బెల్ట్, బి, విశ్వంత్, పి, శివ కుమార్ ఎం, ప్రవళిక, ఆరంజ్ బెల్టులు బీర్ నంది, వాసు విద్యాలయం, ఎం అక్షర్ గ్రీన్ బెల్ట్, గోసంపల్లి బ్రిలియంట్ స్కూల్ బి శ్రావణి, జి చరణ్ తేజ్, జి యుక్తిక, ఆరెంజ్ బెల్టులు. బి లాస్య, వై సురక్షి త్, వి. మనిషా కేత్, జి వరుణ్ కుమార్, ఇల్లు బెల్ట్ లు. ఖానాపూర్ రవి ఏసి హై స్కూల్ ఇన్ కావ్య ఆరెంజ్ కేజీస్ ని ఎల్లో బెల్టులు సాధించారు.