సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాంగ్రెస్ గూటికి చేరిన లోక ప్రవీణ్ రెడ్డి
+ బీజేపీకి గుడ్ బై
+ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
బీజేపీ పార్టి ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఈ మేరకు సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొద్ది సేపు సీఎంతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీలో సైద్ధాంతిక రాజకీయం కనిపించడం లేదని విమర్శించారు. జిల్లాలో పార్టి పెద్దల ఒంటెద్దు పోకడలు కొనసాగుతున్నాయన్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని, కొత్తవారికి ఎంపీ టికెట్లు కేటాయించడం దీనికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా చేస్తానని ఆయన ‘సిరా న్యూస్’కు తెలిపారు.