సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
హనుమాన్ జయంతి సందర్బంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పద్మావతి నగర్ కాలనీలో మంగళవారం శ్రీ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ ను, కౌన్సిలర్స్ ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు కిషోర్ నాయక్ , పరిమి సురేష్ ,కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , తోట సత్యం , బి,రాజేందర్ , ఆలయ కమిటీ అధ్యక్షులు సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.