సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఏపీపీ పోస్ట్‌కు రాజీనామ చేసే, కాంగ్రెస్‌లో చేరా…
+ తాను కాంగ్రెస్‌లో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ
+ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతాం
+ ప్రముఖ్య న్యాయవాది మేకల మధుకర్
తాను ఏపీపీ పోస్ట్‌కు రాజీనామ చేసిన తరువాతే కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రముఖ న్యాయవాది మేకల మధుకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బిడ్డనైన తాను కాంగ్రెస్‌లో చేరడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోందని ఆయన అన్నారు. దళితులు, బహుజనుల ఎదుగుదలను బీజేపీ ఎప్పుడు కూడ సహించే స్థితిలో లేదని ఆయన విమర్శించారు. తాను రాజీనామ చేసిన విషయాన్ని తెల్సుకోకుండా, సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలను బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. తనపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడం శోచనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించుకొని, బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, న్యాయవాది అఫ్రోజ్, ముజాయిద్, తదితరులు పాల్గొన్నారు.