సిరా న్యూస్, బోథ్
కౌట(బి)లో వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం మహోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట(బి) గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ గా జరిగింది. గత మూడు రోజులుగా కార్యక్రమాన్ని భక్తులు కొనసాగిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన వ్రతాన్ని ఊరేగించిన అనంతరం వివాహ వేడుకలను జరుపుకున్నారు. గురువారం జరిగిన కార్యక్రమం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలు గ్రామాల వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు పాల్గొన్నారు.