సిరా న్యూస్, కుందుర్పి
కుందుర్పిలో ఎన్‌టీఆర్ జయంతి వేడుకలు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలను మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజా వేదిక దగ్గర కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.