సిరా న్యూస్, చిగురుమామిడి
మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకొని తిరిగి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు చిగురుమామిడి మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం హైదరాబాద్ తరళివెళ్ళి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఘన స్వాగతం పలికారు. వేకువజామునే విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఠాకూర్ నరేందర్ సింగ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ షాబొద్దీన్, నాయకులు అందే సురేష్, ఠాకూర్ దిలీప్ సింగ్ పాల్గొన్నారు.