Death mystery: శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్ధి అనుమానస్పద మృతి

సిరా న్యూస్,మేడ్చల్;
శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి మల్లికార్జున13 చైతన్య పాఠశాల కె ఫోర్ క్యాంపస్లో ఈ బాలుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. మెదక్ జిల్లా చిల్వెర గ్రామానికి చెందిన మాదవి, బీరప్ప తల్లిదండ్రులు, వీరి కుమారుడు మల్లికార్జున ను స్కూల్ లో చేర్పించారు..సోమవారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థి ఉదయం నిద్ర లేవలేదు. దీంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *