సిరా న్యూస్,పెద్దపల్లి;
మహనీయుల ఆశయ సాధన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా అంబాల నరేష్ ను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం తెలిపారు. ఈమేరకు పెద్దపల్లిలో నరేష్ కు నియామక పత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల ఐక్యతతో సంఘం సిద్ధాంతాలను గ్రామ గ్రామాన ప్రచారం చేసి బహుజనుల ఐక్యత కోసం పని చేయాలని నరేష్ కు సూచించారు. తన నియామకానికి సహకరించిన కైలాసంకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం పెర్క రాజేశం, కండె కరుణాకర్, వడ్డేపల్లి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.