Supervisor L. Sushila: చిన్న‌పిల్ల‌ల‌ను అంగ‌న్‌వాడీల‌కు పంపాలి: సూప‌ర్‌వైజ‌ర్ ఎల్‌. సుశీల‌

సిరా న్యూస్, భీమదేవరపల్లి
చిన్న‌పిల్ల‌ల‌ను అంగ‌న్‌వాడీల‌కు పంపాలి: సూప‌ర్‌వైజ‌ర్ ఎల్‌. సుశీల‌
* భీమదేవరపల్లిలో అమ్మ మాట అంగన్వాడి బాట..

తల్లిదండ్రులు తమ చిన్నపిల్లలను ప్రవేట్ స్కూళ్లకు పంపవద్దని అంగన్వాడి స్కూల్ లోకి పంపాలని భీమదేవరపల్లి మండల ఐసీడీఎస్ సూప‌ర్‌వైజ‌ర్‌ ఎల్. సుశీల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారి వెంట ప్లకార్డులతో ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూపర్‌వైజ‌ర్‌ సుశీల మాట్లాడుతూ వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్ స్కూళ్లకు పంపవద్దని, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అంగన్వాడి స్కూళ్లలో విద్యతోపాటు ఆటపాటలు ఉంటాయని తెలియజేశారు. కార్య‌క్ర‌మంలో గ్రామ‌స్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *