కడప జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు హెచ్చరిక
సిరా న్యూస్,బద్వేలు;
జిల్లా ఎస్పీఆదేశాల మేరకు బహిరంగ మద్యపానం జరిగే ప్రాంతాలపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీ, మునిసిపల్ శాఖల సమన్వయంతో ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించి మద్యం సేవించేందుకు వీలులేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించడం చట్ట వ్యతిరేకమని, నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను పోలీస్ అధికారులు, సిబ్బంది గుర్తించి, పంచాయతీరాజ్/మున్సిపల్ శాఖల సిబ్బంది సహకారంతో స్వయంగా శుభ్రం చేయించారు .ఫలితంగా బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలు కనుమరుగై బహిరంగంగా మద్యం సేవించకుండా ఉండడం వలన నేరాలు తగ్గుముఖం పడతాయని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అన్నారు.