Odela: ఓదెలలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

సిరాన్యూస్‌,ఓదెల
ఓదెలలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బుధ‌వారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు ఘ‌నంగా నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంత‌రం ఓదెల బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పోలోజు రమేష్ మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. కార్య‌క్ర‌మంలో మండల ప్రధాన కార్యదర్శి చింతం మొగిలి, మండల రైతు కమిటీ అధ్యక్షుడు బుద్దే పోశెట్టి, ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం డైరెక్టర్ చింతం వెంకటస్వామి, మండల యూత్ అధ్యక్షుడు మేడగొని శ్రీకాంత్, బోయ సదానందం కోండ్ర రవి, గడ్డం శ్యాము యూత్ శ్రవణ్ కుమార్ సూత్రాల, గుండేటి మధు మాజీ సర్పంచ్, శ్రీనివాస్ మాజీ గ్రామ అధ్యక్షుడు రాచర్ల కుమార్ , గోపతి పోశాలు గోపతి ఎర్ర మల్లయ్య, ఒ ల్లాల రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *