సిరాన్యూస్, ఉట్నూర్
ఉట్నూర్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
* హాజరైన మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో బుధవారం మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ ఎస్ మండల నాయకులు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ కల్వకుంట్ల తారకరామారావు, కె టీ ఆర్, నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యలతో సుఖ సంతోషాలతో బాగుండాలని ప్రజా సేవలో ఇంకా ముందు ఉండి ప్రజలకు అన్ని విధాల సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పంద్రా జైవంత్ రావు ,మాజీ వైస్ ఎంపీపీ సలీమోద్దీన్, బి ఆర్ ఎస్, వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ,దుట మహేందర్, కోలా సత్తన్న , భూమన్న, కొమ్ము విజయ్, కామెరి రాజు ,సాజిద్ కలీం ,అలీం, బల్వంత్ ధవుల రమేష్, శ్రీకాంత్ ,ఆర్షద్, అజ్జు, బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.