సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి బరిలో అయిండ్ల రంజిత్ రెడ్డి
అదిలాబాద్ టౌన్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ కి చెందిన అయిండ్ల రంజిత్ రెడ్డి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో నిర్వహించే ఎన్నికలో తనకు ఓటు వేసి గెలిపించాలని యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ను అభ్యర్థించారు. గత కొన్ని సంవత్సరాలుగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ కి అనేక సేవలు చేశారు.