Induthi Road: గుంతలమయంగా ఇందుర్తి రోడ్డు

సిరాన్యూస్‌, ఓదెల
గుంతలమయంగా ఇందుర్తి రోడ్డు
* ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్ర‌భుత్వాలు మారిన త‌మ గ్రామ రోడ్డు ప‌రిస్థితి మార‌డం లేద‌ని ఇందుర్తి గ్రామస్తులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం నుండి వావిలాల ఎక్స్ రోడ్ వరకు రోడ్డు పూర్తిగా గుంత‌ల మాయంగా మారింది. నిత్యం వంద‌లాది మంది ఈ ర‌హ‌దారి గుండా ప్ర‌యాణిస్తున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డుతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు . సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డును బాగా చేయించాలని ప్ర‌యాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *