ముక్కంటి సేవలో జర్మనీ దేశస్తులు

సిరా న్యూస్,శ్రీకాళహస్తి ;
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం పరదేశీయులు సందడి చేశారు సంప్రదాయ దుస్తులతో జర్మనీకి చెందిన పదిమంది ముక్కంటిశుని దర్శనం కోసం తరలివచ్చారు ఆలయంలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్వామి, అమ్మ వార్ల, తో పాటు శని భగవాను ని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు ఇక్కడ ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు పురాతన కాలంలో నిర్మించిన గోపురాలు ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్ప కళలను చూసి ఆత్మానందాన్ని పొందారు వారి స్నేహితులు చెప్పడంతో ఇక్కడి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *