యాప్రాల్ లో విజయ్ దివాస్

సిరా న్యూస్,సికింద్రాబాద్;
52 ఏండ్ల క్రితం 1971లో పాకిస్తాన్ పై భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే “విజయ్ దివస్” వేడుకలు నగరంలోని అల్వాల్ సర్కిల్ యప్రాల్ లో ఆర్మీ సైనికులు ఘనంగా నిర్వహించారు. రన్ ఫర్ సోల్జర్, రన్ విత్ సోల్జర్ అంటూ “సౌత్ రన్ స్టార్ – విజయ్ రన్” పేరుతో పరుగు పోటీలను నిర్వహించారు. పాకిస్తాన్ తో సుధీర్ఘంగా జరిగిన పోరులో అమరులైన భారత్ జవాన్లను గుర్తు చేసుకుంటూనే సాధించిన ఘన విజయానికి గుర్తుగా ప్రతీ ఏటా డిసెంబర్ 16ను విజయ్ దివస్ ను జరుపుతున్నట్లు అతిథులు తెలిపారు. వందలాది మంది త్రివిధ దళాల సైనికులు, సైనికుల కుటుంబీకులు, సాధారణ పౌరులు ఈ విజయ్ రన్ లో పాల్గొన్నారు. 5కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 12.5 కిలో మీటర్ల విభాగాలలో నిర్వహించిన పోటీలలో ప్రతిభను చాటిన వారికి అతిధుల చేతులమీదుగా పతకాలు, ప్రోత్సాహకాలను అందజేశారు. రన్ లో పాల్గొన్న 10 సంవత్సరాల లోపు చిన్నారులకు, 70 సంవత్సరాల పైబడిన వృద్దులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *