సిరా న్యూస్,కోసిగి;
మండలం చిన్న భోంపల్లి, పెద్ద భోంపల్లి గ్రామాలలో కార్తీకమాసం సందర్భంగా రెండు గ్రామాలలో నిర్వహించిన కార్తిక పూజ పండుగ సందర్భంగా చిన్న భూంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పెద్ద భూంపల్లి శ్రీ ఆంజనేయ స్వామి కార్తీక పూజ మహోత్సవము ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు తనయుడు తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి గ్రామ నాయకులు చిన్న బొంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం దేవాలయం పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి శాలువా పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు పాలకుర్తి దివాకర్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు పాలకుర్తి దివాకర్ రెడ్డి గారికి గ్రామ నాయకులు భారీ ఎత్తున సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పెద్ద బొంపల్లి జనార్ధన్, ఆంజనేయ, హనుమంతు, రామకృష్ణ, హనుమంత్ రెడ్డి, చిన్న బొంపల్లి మాజీ ఉపసర్పంచ్ హుసేని, రమేష్, వెంకటేష్, నిలకంఠ , ప్రహల్ధ్,సాంబ తదితరులు పాల్గొన్నారు