Chintakunta Vijaya Ramana Rao: ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సిరాన్యూస్‌, ఓదెల
ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని జమ్మికుంట మండలానికి చెందిన‌ కొమ్ము కొమురయ్య, రూపు నారాయణపేట గ్రామానికి చెందిన వనపర్తి రమణయ్యలు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. బాధిత కుటుంబాల‌కు విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని శుక్ర‌వారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అంద‌జేశారు. కొమ్ము కొమురయ్య కుటుంబానికి రూ.5ల‌క్ష‌లు, వనపర్తి రమణయ్య కుటుంబానికి రూ. 40వేలు విలువ చేసే చెక్కులు కుటుంబ స‌భ్యుల‌కు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *