సిరా న్యూస్,సామర్లకోట
వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప
నియోజకవర్గం వ్యాప్తంగా వినాయక చవితి పురస్కరించుకొని ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద శనివారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈసందర్బంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు వినాయకుని మంటపాలు సందర్శించి పూజలు నిర్వహించారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామం ప్రకాశంపేట ,సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోను, సామర్లకోట పట్టణంలో ఆటో యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలోని ,పెద్దాపురం పట్టణ పరిధి తూతిక రాజు ఇంటి వద్ద అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసుకున్న పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.