సిరాన్యూస్,హుజురాబాద్
మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయండి : ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాళ్ళ నరేష్
* మహా సమ్మేళనం కరపత్రాలు ఆవిష్కరణ
హైదరాబాద్‌లో నవంబర్ 3న నిర్వహించబోయే ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ధర్మసామాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్ పిలుపునిచ్చారు.శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని అంబేడ్కర్ కూడలి వద్ద మహా సమ్మేళనం కరపత్రాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ పీడీత ప్రజల ఆత్మగౌరవం అధికారం కోసం అగ్రకుల భూస్వామ్య వ్యవస్థ పై తిరుగుబాటు చేయడానికి 2023 మార్చి 15వ తారీఖున ధర్మసమాజ్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఇప్పటికీ అనగారిన వర్గాల ప్రజలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే మౌలిక అంశాలు ఎక్కడ అందడం లేదన్నారు.అణగారిన వర్గాల జీవితాలు మార్చడానికి ధర్మసమాజ్ పార్టీ అనే రాజకీయ వేదిక ఏర్పడిందని తెలిపారు.పార్టీ నిర్మాణం సమీక్ష భవిష్యత్తు కార్యాచరణ కోసం ధర్మసమాజ్ పార్టీ మహా సమ్మేళనాన్ని నిర్వహించబోతుందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు విధిగా కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. మహా సమ్మేళనం అనంతరం భారీ సామాజిక పోరాటానికి పార్టీ సిద్ధమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అన్నారం బాబు, గాజుల రవి, జిల్లాల సురేష్, సందీప్ రవితేజ పాల్గొన్నారు.