జగన్ అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి.. చేతకాని దద్దమ్మ

దుర్మార్గుడైన జగన్‌కి దేవుడైన ఏసుక్రీస్తుతో పోలికా?
సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద గాడిద..
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

సిరా న్యూస్,రాజమండ్రి ;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం విజయదుందుభి మోగించిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. లోకేష్ రాష్ట్రమంతా తిరిగి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారన్నారు. జగన్ టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సిట్టింగ్‌లను మార్పు చేస్తున్నారన్నారు. రామచంద్రాపురంలో పనిచేయని మంత్రి రాజమండ్రి రూరల్‌లో ఏలా పని చేస్తారని ప్రశ్నించారు. జగన్ తన వైఫల్యాలను మంత్రులు, ఎమ్మెల్యేల పైకి నెట్టేస్తున్నాడని విమర్శించారు. మంత్రులకు కూడా స్థాన చలనమా? అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.ఒకచోట అవినీతిపరుడైన వాడు ఇంకొక చోట పనిచేస్తాడా? అని ప్రశ్నించారు. అంగన్‌వాడీల సమస్యలు ఎందుకు పరిష్కరించటం లేదన్నారు. ఇంకా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘‘జగన్ ఏసుక్రీస్తా? దుర్మార్గుడైన జగన్‌కి దేవుడైన ఏసుక్రీస్తుతో పోలికా? జగన్‌ను ఇంటికి పంపటమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ జరగబోతోంది. జగన్ రాష్ట్రాన్ని అప్పులమయంగా తయారుచేశాడు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెడుతున్నాడు. జగన్ అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి.. చేతకాని దద్దమ్మ. ప్రభుత్వ జీవోలు రహస్యంగా ఉంచుతావా?సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద గాడిద.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైలులో పెడతాం. జగన్ వద్దు బాబోయ్ అని జనం అంటున్నారు. పార్టీ కోసం త్యాగం చేసి గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచాను. సిట్టింగ్‌లకు స్థాన చలనం లేదని చంద్రబాబు చెప్పారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేశాను. వచ్చే ఎన్నికల్లో నేను ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుస్తాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అభ్యర్థులను నిర్ణయిస్తారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికే సీటు. జగన్ డబ్బులు ఇచ్చి దొంగ సర్వేలు చేయుంచుకొని సాక్షి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడు’’ అని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *