సిరాన్యూస్,కాల్వశ్రీరాంపూర్
కాల్వశ్రీరాంపూర్‌లో రోడ్లన్నీ గుంతలమయం
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీ చౌరస్తా వద్ద ప్రధాన రహదారి గుంతలమయం అయ్యింది. ఈ దారి గోదావరిఖని నుండి జమ్మికుంట.హన్మకొండ కు ముత్తారం గ్రామాలకు వెళ్లే వాహనాలు ఎక్కువ కావడం వలన వాహనాలకు. ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. రోడ్డు వేసి తక్కువ సమయంలోనే గుంతలు కావడం వలన ప్రజలు గుంతలో పడి గాయాలు అవుతున్నాయని అంటున్నారు.ఇవేకాకుండా రోడ్లపైన అక్కడక్కడా గుంతలు ఎక్కువయ్యాయి.చాలా సార్లు కంకర మట్టి పోసిన ఉండటం లేదు. దీనిపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఫ్యాచ్ వర్క్ చేయించాల్సిందిగా ప్రజలు అధికారులను కోరుతున్నారు.