సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఈదునూరి స్వామి ఏఎస్ ఐగా పదోన్నతి పొందారు. మండలంలోని తురుకలమద్దికుంట గ్రామానికి చెందిన స్వామి తన విద్యాభ్యాసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఇండియాన్ మిషన్ హైస్కూల్ లో సాగింది. కాగా జగిత్యాలలో కానిస్టేబుల్ గా మొదటి పోస్టింగ్ అందుకున్న ఆయన తదుపరి గోదావరి ఖని, పెద్దపల్లి డివిజన్ లో విధులు నిర్వహించారు. ఇందులో భాగంగానే 2014 లో కమన్ పూర్ పోలీస్ స్టేషన్ పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఆయనను గోదావరి ఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా సుమారు 5 ఏళ్ళు అక్కడ విధులు నిర్వర్తించారు. అటు తర్వాత పెద్దపల్లి ట్రాఫిక్ కు బదిలీపై వచ్చారు. ఇక్కడ నాలుగున్నరేళ్లు పనిచేసిన స్వామికి ఏఎస్ ఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ అభినందనలు తెలిపి,ప్రమోషన్ పత్రాలు అందజేశారు. అందరితో కలివిడిగా ఉంటూ విధులు నిర్వహించే స్వామికి ప్రమోషన్ రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు, అభిమానులు అభినందనలు తెలిపి వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.