సిరాన్యూస్,చర్ల:
చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ నాయకుల ధర్నా
1/70 యాక్టును పటిష్టంగా అమలుపరచాలి
* గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి
* భూమిలేని నిరుపేద గిరిజనులకు ఆ భూములను పంచాలి
* ఆదివాసీ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోదారి పక్కనే ఉన్న కూర గడ్డ భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో ఉన్నాయని, అవి ఆదివాసి ప్రజలకు పంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం చర్ల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆదివాసీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని చర్ల తహసీల్దారు శ్రీనివాస్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ముసలి సతీష్ మాట్లాడుతూ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఆదివాసి హక్కులని కాలరాస్తూ పీసా,1/70 యాక్ట్ లను తుంగలో తొక్కుతూ ఇక్కడే పుట్టి పెరిగిన ఆదివాసీల్ని పక్కకు నెడుతూ భూస్వాముల చేతుల్లోకి తరలిస్తున్నారని, ఈ భూములను ఇవ్వమని అడిగిన చట్టాలు వర్తింప చేయండి అని చెప్పిన పాలకులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని అన్నారు. దండుపేట, కొత్తపల్లి, లింగాపురం, కొంపల్లి సి కొత్తూరు, ఆనంద కాలనీ, కత్తి గూడెం ఆదివాసీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కూడు గూడు నోచుకోకుండా లేదని ఆరోపించారు. భూస్వాముల చేతుల్లో వెట్టిచాకిరి చేస్తూ జీవితం సాగిస్తున్న ఆదివాసీలకు ఇక్కడ భూములు లేవు గాని ఎక్కడ నుంచే వచ్చిన భూస్వాములకు వేల ఎకరాలు ఎలా వచ్చాయో తెలపాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ అవి ఉన్నోడికి చుట్టాలుగా మార్చుకుంటున్నారు తప్పితే నిజమైన ఆదివాసీలకు న్యాయం జరగడంలేదని అన్నారు. తక్షణమే భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను ఆదివాసి ప్రజలకు పంచాలని, లేకుంటే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసి ప్రజలకు పంచుతామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏఐటిఎఫ్ జిల్లా నాయకులు గొంది. ముయన్న ,ఆదివాసి సంఘం అధ్యక్షుడు దుబ్బరాజు, కార్యదర్శి పునెం రవి కిరణ్, కోరం చిన్న ముత్యాలు, కాక వీరన్న, ఇర్ఫా ,అరుణ్ కుమార్, సబ్కా అశోక్, కాక వెంకటేష్, దుబ్బ సమ్మయ్య, మహిళా సంఘం నాయకురాలు తెల్లం సుశీల, ఇర్ప సారమ్మ, బంధ సంధ్య, కోరం భద్రమ్మ, సోడి సూర్య, భవాని పి అనూష ఇర్ఫా రాజేష్, తదితరులు పాల్గొన్నారు.