అనాధ శరణాలయంలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను జరుపుకున్న చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసులు

సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి రూరల్ పద్మావతి పురంలో స్థానికంగా ఉన్న పాస్ మనోవికాస్ కేంద్రంలో చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసులు నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను జరుపుకున్నారు ఈ వేడుకలలో భాగంగా మనోవికాస్ కేంద్రంలో ఉన్న ప్రత్యేక అవసరాలు గల ప్రతిభావంతులకు , మానసిక వికలాంగులకు అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని, రాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పి యశ్వంత్ మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను పాస్ మనోవికాస్ లో గల పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు అలాగే చంద్రగిరి ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు సి.ఐ బీ.వీ శివప్రసాద్ రెడ్డి ఎస్సైలు చిరంజీవి జనార్దన్ రెడ్డి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *