రాబోయే రోజుల్లో జగన్ కు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలి

అంగన్వాడీ హక్కుల సాధన ధర్నలో మద్దతు తెలిపిన మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య, రామిరెడ్డి,రాఘవేంద్ర రెడ్డి

 సిరా న్యూస్,కౌతాళం;
దాదాపు 23 రోజులు గడుస్తున్నా అంగన్వాడీ టీచర్లు,అయాలు తమ హక్కులు కోసం చేస్తున్న ధర్నాని చూసి ఎలాంటి స్పందన లేకపోవడం ఒక విడ్డూరం మరియు కనీస వాళ్ళ అవసరాలు తీర్చలేని పనికి రాని ముఖ్యమంత్రి ఎంచుకున్నందుకు రాష్ట్ర ప్రజల దురదృష్టకారమని తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య, రామిరెడ్డి,రాఘవేంద్ర రెడ్డి అన్నారు.. రాబోయే రోజుల్లో అంగన్వాడి టీచర్లు కు తమ హక్కులు నెరవేర్చే దిశగా పనిచేస్తామని,మీహక్కుల గురించి మా ఆదిన యకత్వం దృష్టికి తిస్కెళ్తమని,మీరు చేస్తునటువంటి ధర్నాకు మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపాయని,మా మంత్రాలయం తెదేపా పార్టీ నుండి మీకు పూర్తి మద్దతుగా గురువారం మీ హక్కుల సాధనలో మేము కూడా పోరాడుతామని తెలియజేశారు. తేదేపా సీనియర్ నాయకులు మరియు సీపీఎం నాయకులు మల్లయ్య ఈ కార్యక్రమములో తేదేపా నాయకులు సుబ్రహ్మణ్యం గనీలకంఠ రెడ్డి,నరసింహమూర్తి స్వామి,తెలుగు యువత సురేష్ నాయుడు, రాహిమన్,రాజేంద్ర నాయుడు,రాకేష్ రెడ్డి,ముకన్న,రమేశ్, జనసెనా నాయకులు రామాంజినేయులు, మబ్బష,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *