సిరా న్యూస్, బేల:
10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి...
-జిల్లా విద్యాధికారి ప్రణీత..
10 వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా విద్యాధికారి ప్రణీత అన్నారు. గురువారం ఆమె బేల, సిర్సన్న ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, బేల ప్రాథమిక పాఠశాలను అకస్మితంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలోని పలు రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ… సబ్జెక్టు పరంగా ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలన్నారు. ఆమె వెంట సెక్టోరియల్ అధికారులు నారాయణ, సుజిత్ ఖాన్ , ప్రధానోపాధ్యాయులు కోలా నర్సింలు, మహాలక్ష్మి, సదానంద్, ప్రత్యేక అధికారి నవీన్ ఉన్నారు.