వంద పడకల ఆసుపత్రి కి కూటమి నాయకులు సహకరించాలి

సిరా న్యూస్,కౌతాళము;
వంద పడకల ఆసుపత్రికి, టిడిపి, జనసేన కూటమి నాయకులు సహకరించాలనీ. భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూటమి నాయకులు వంద పడగల ఆసుపత్రికి సహకరించి ముందుకు రావాలని కోరారు. ఎన్నికల హామీల్లో భాగంగా కౌతాళం మండలంకు వంద పడకల ఆసుపత్రి సహకరించి ముందుకు రావాలని కోరారు. జిల్లా మంత్రి భరత్ కు నవంబర్ 4వ తారీఖున కలిసికట్టుగా వెళ్లి కలవాలని అనంతరం వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కుడా కలసి కలవాలని కోరారు. నవంబర్ 4వ తారీఖున కుటమి నాయకులు ముందుకు రావాలని వారు కోరారు. మండలంలో చిరస్థాయిగా పేరు నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నబి. వెంకట రెడ్డి. రామచంద్ర ,ఈరన్న, రాజశేఖర్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *