సిరాన్యూస్,బేల
రక్తదానం చేసిన ఎండి అఖిల్ : యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
గత కొన్ని రోజులుగా రక్త హీనతతో బాధపడుతున్నఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన డోకే గంగారాం అనే వ్యక్తికి ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో యువకుడు రక్తదానం చేశారు.ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన బాధితుడికి వైద్యులు ఏ పాజిటివ్ రక్తం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు. వెంటనే వారు అదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డిని సంప్రదించగా ఆయన వెంటనే బేల మండలం దైగావ్ గ్రామానికి చెందిన ఎండి అఖిల్ అనే యువకుడితో బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయించారు.దీంతో అత్యవసర సమయంలో స్పందించిన సామ రుపేష్ రెడ్డి తో పాటు యువకుడికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్ తో పాటు కుటుంబ సభ్యులు డోకే సతీష్ తదితరులు ఉన్నారు.