తండ్రి కోసం కదిలిన తనయుడు..
- పట్టణంలో ప్రచార వేగం పెంచిన ప్రేమేందర్
- బీజేపీ, కాంగ్రేస్‌లపై విమర్శలు
సిరా న్యూస్ (ఆదిలాబాద్ బ్యూరో): ఆదిలాబాద్ పట్టణంలో అభివృద్ధి లేదనడం హస్యస్పదంగా ఉందని మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న తన తండ్రి ఎమ్మెల్యే జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రేస్ నాయకులు ఆదిలాబాద్ పట్టణంలో అభివృద్ధి లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో అధికంగా ఆదిలాబాద్‌కే వచ్చాయని గుర్తుంచుకోవాలన్నారు . మసూద్ నగర్, రవీంద్ర నగర్‌లో ఇంటింట తిరుగుతూ.. బీఆర్‌ఎస్ మేనిఫెస్ట్‌ను వివరించారు. 70 ఏండ్లు పాలించిన బీజేపీ, కాంగ్రేస్‌లు ప్రజా సంక్షేమాన్ని మరిచాయని విమర్శించారు. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మెరుగైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి కూడ ప్రజలంత మళ్ళీ బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి, ఎమ్మెల్యేగా జోగు రామన్నను, సీఎంగా కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్ రాజు, నాయకులు అజయ్, మోబిన్, సాజిదోద్దిన్, రాథోడ్ గజు, తదితరులు ఉన్నారు.