సిరాన్యూస్,జైనథ్
కడదరపు ఆశన్నను పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడకు చెందిన కడదరపు ఆశన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకొని ఆశన్నను కలిసి పరామర్శించారు. అనంతరం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సిబ్బందిని కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యాన్ని నచ్చజెప్పారు. ఈయన వెంట ఇజ్జగిరి నారాయణ, అల్ల కొండ అశోక్,సాయి, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.