సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో విచిత్ర సంఘటన జరిగింది. అప్పిచ్చిన బిచ్చగాడికి వ్యాపారి ఎగనామం పెట్టాడు. బోనకల్ కు చెందిన హోటల్ వ్యాపారి రామన నర్సింహారావు ఖమ్మం కోర్టులో 1కోటీ 95లక్షలకు ఐపీ దాఖలు చేసాడు. మొత్తం 69 మంది పేర్లను ప్రతివాదులుగా చేర్చుతూ ఖమ్మంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేసాడు. కోర్టు 69 మంది ప్రతివాదులకు నోటీసులు పంపింది. నోటీసులు పొందిన వారిలో స్థానిక సాయిబాబా ఆలయం ఎదుట బిచ్చమెత్తుకుంటున్న బిచ్చగాడు గొళ్లల అశోక్ వున్నాడు. మూడు సంవత్సరాల క్రితం బిచ్చగాడు అశోక్ దాచుకున్న యాభైవేల రూపాయాలను హోటల్ వ్యాపారి నర్సింహారావు అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్ల నుంచి తీసుకున్న అప్పుకు వడ్డీకూడా చెల్లించకుండా ముఖం చాటేసాడు. నర్సింహారావు ఇటీవల దివాళా పిటిషన్ దాఖలు చేశాడన్న సమాచారంతో బిచ్చగాడు అశోక్ ఆందోళన చెందుతున్నాడు.