మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా…? రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదు. రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు. ఇప్పుడు స్పెషల్ పోలీసులను తీసివేశారు రేపు ఆర్మ్డ్ పోలీసులు తిరగబడితే ఏం చేస్తారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి ఆంధ్రా పోలీసులను తెచ్చుకుంటారా అని నిలదీసారు.