సిరా న్యూస్,రంగా రెడ్డి;
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలపడం భక్తుల మనోభావాలు దెబ్బతినేల వ్యవహారించిన మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు 300 దేవాలయాలను కూల్చివేసిన హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఎంతో ఆరాధ్యంగా భావించే లడ్డును కల్తీ చేసిన వారిని వెంబడే అరెస్టు చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ని అపవిత్రం చేసిన వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టడు కలియుగ దైవం అయినా శ్రీనివాసుడు అని మండిపడ్డారు.
హిందూ దేవి దేవతలను ఎవరైనా సరే కించపరిచిన హిందూ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఎవరు చేసిన వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడికూడా యాదగిరి, సామ సంజీవరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం మల్లారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్ దేవేందర్ రెడ్డి . హిందూ సంఘాల సభ్యులు పాల్గోన్నారు.