Secretary Kantha Rao: 30న జిల్లా స్థాయి అండ‌ర్‌-14 క్రికెట్ ఎంపిక పోటీలు:  ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
30న జిల్లా స్థాయి అండ‌ర్‌-14 క్రికెట్ ఎంపిక పోటీలు:  ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 30న సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సూపర్ టీ – 20 స్టేడియం దస్నాపూర్లో అండర్ -14 జిల్లాస్థాయి బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు తెలిపారు. 1-1-2011 తర్వాత పుట్టిన వారు 14 సంవత్సరాల విభాగంలో ఎంపిక పోటీలో పాల్గొనేందుకు అర్హులు అన్నారు. అర్హులైన క్రీడాకారులు సంబంధిత వయస్సు ధ్రువీకరణ పత్రం బోనఫైడ్ తో ఉదయం 10 గంటలకు పోటీల కన్వీనర్ రాష్ట్రపాల్ కి రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల నుండి 3 క్రీడాకారులు పాల్గొనాలి, ఇతర వివరాలకు 7702035200 నంబర్లో సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *