పెద్దపల్లి పట్టణాన్ని సుందరికరించడమే లక్ష్యం

పెద్దపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తా
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్థాననీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధి రంగంపల్లి ప్రాంతంలోని 11వ వార్డులో టీ.ఎఫ్.ఐ.డి.సి ప్యాకేజీ -6 ద్వారా ₹91.50 లక్షల నిధులతో 8వ వార్డులో శివపురి కాలని రోడ్డు వద్ద ₹29 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని సుందరికరించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక పథకాలను అమలు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *