అభివృద్ధికి పట్టం కట్టండి బీఆర్ఎస్ కు మద్దతుగా నాయకుల ప్రచారం.

                                                                             రుద్రంగి, (సిరా న్యూస్)
60 ఏళ్ల కాంగ్రెస్ పాలన వాగ్దానాలకే పరిమితమైందని కేసీఆర్  నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది కాలంలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని బీఆర్ఎస్ నేతలుఎంపిటిసిమంచె రాజేశం, బండారి నర్సయ్య ఆన్నారు.. మంగళ వారంరుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వేముల వాడ నియోజక వర్గం అభ్యర్థిచల్మెడ లక్ష్మీ నరసింహరావుకు మద్దతుగా అభివృద్ధి, సంక్షేమానికిపెద్ద పీట వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ప్రచారం నిర్వహించారు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు చల్మెడలక్ష్మీనరసింహరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను  ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎంపిటిసి మంచె రాజేశం, బండారినర్సయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ తోనే
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించేప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. నవంబర్ 30న నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనిభారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.అలాగేవేములవాడ నియోజకవర్గబీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలోనాయకులుతలారినర్సయ్య, ప్రదీప్, గంగాధర్, బీఆర్ఎస్ నాయకులుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *