ఇక్కడ హోరాహోరీ:…..

ఇక్కడ హోరాహోరీ:
కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ మధ్య ముక్కోణపు పోరు జరుగుతోంది. ఎంపీగా ఉన్న బండి సంజయ్గత శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించగలిగారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ హవా కూడా ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాను గెలుస్తానని గంగుల భావిస్తున్నారు.
జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సంజయ్, బీజేపీ నుంచి బోగ శ్రావణి బరిలో ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న శ్రావణి ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తుండడంతో అధికార పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు.
ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నుంచి జోగు రామన్న ఐదోసారి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్ గట్టి పోటీనే ఇస్తున్నారు. మూడుసార్ల ఓటమి అనంతరం ఈ దఫా ఎలాగైనా గెలవాలని పాయల్శంకర్పట్టుదలతో ఉన్నారు.
నిర్మల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్కు ఉన్న కార్యకర్తల బలం కారణంగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొన్నది.
సిర్పూర్లో బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్ బాబు, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉందని భావించవచ్చు.
పఠాన్ చెరులో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. బీఎస్పీ నుంచి పోటీకి దిగిన నీలం మధు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు.
మంథనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి 2014లో టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి వికాస్రావు మధ్య గట్టి పోటీ ఉంది. నాలుగుసార్లు ఓడిపోయిన ఆది శ్రీనివాస్ సానుభూతి, ప్రజాదరణ తనను గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు; అయితే మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు కొడకు వికాస్రావు పోటీ చేస్తుండడంతో ప్రజల తీర్పుపై ఉత్కంఠ ఏర్పడింది.
హుస్నాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వొడితెల సతీశ్కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా శ్రీరాం చక్రవర్తి పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్కుమార్కు ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలంగా మారింది. శ్రీరాం పేరు ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. ఇది ఎవరికి లాభిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేస్తున్నారు. అధికార పార్టీకి కొండా సురేఖ గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా తనపని తాను చేసుకుపోతున్నారు.
నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ నుంచి బిగాల గణేశ్గుప్త, బీజేపీ నుంచి ధనపాల్ సూర్యనారాయణ పోటీలో దిగారు. బీజేపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు, ధనపాల్‌కు గతంలో ఓటమి సానుభూతి కలిసిరావచ్చని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్లను షబ్బీర్ అలీ నమ్ముకున్నారు.
ఆర్మూరులో బీఆర్ఎస్ నుంచి జీవన్రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి వినయ్రెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార పక్షం ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉందని పరిశీలకులు చెప్తున్నారు. ఓటుబ్యాంకును బీజేపీ, కాంగ్రెస్ హవాను వినయ్రెడ్డి నమ్ముకున్నారు.
మహేశ్వరంలో బీఆర్ఎస్ నుంచి సబితారెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ బరిలో ఉన్నారు. ఓటమి సానుభూతితో పాటు స్థానికుడు కావడం బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎటు పడ్తాయన్నదే గెలుపోటములను నిర్ణయించే అంశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *