ఎన్నికల్లో నోట్ల కట్టల ప్రవాహం….

హైదరాబాద్, (సిరా న్యూస్);
ఎన్నికలంటే డబ్బులు, మద్యం, గిఫ్ట్‌లు, ఆభరణలు, ఉచితాలు.. ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు ఎన్నో ఎత్తుగడులు వేస్తుంటాయి పార్టీలు. ఓటర్లను మభ్యపెట్టే౦దుకు, ఓట్లు దండుకునేందుకు డబ్బులను ఎరగా వేస్తుంటాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇవి సర్వసాధారణం ఐపోయాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ భారీగా నగదు బయటపడుతోంది. పోలీసులు ఎక్కకడిక్కడ తనిఖీలు చేస్తుండగా.. రోజు కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం, ఆభరణలు సీజ్ అవుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండగా.. తెలంగాణలో ఇది చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికల వేళ ఎంత సొత్తు సీజ్‌ అయ్యిందో కేంద్ర ఎన్నికల సంఘం ఓ డేటాను రిలీజ్ చేసింది. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో భారీగా సొత్తు సీజ్‌ అవ్వగా.. ఇప్పటివరకూ 5 రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువ. అత్యధికంగా తెలంగాణలోనే రూ.225.25 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో రాజస్థాన్‌ ఉంది. ఈ ఎడారి రాష్ట్రంలో రూ. 93.17 కోట్ల నగదును పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లో రూ.33.72 కోట్లు, చత్తీస్‌గఢ్‌లో రూ.20.77 కోట్లు సీజ్‌ చేశారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు 228 మంది అబ్జర్వర్లను పంపింది ఈసీ.ఈసారి కమిషన్ పర్యవేక్షణలో సాంకేతికతను కూడా ఉపయోగించుకుంది. ఎన్నికల వ్యయ మానిటరింగ్ సిస్టమ్ (ESMS) ద్వారా ప్రక్రియ ఈజీ అయ్యింది. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ ప్రక్రియలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఇది రియల్ టైమ్ రిపోర్టింగ్‌ను సులభతరం చేసింది. అంటే సమాచారాన్ని సేకరించడంలో సమయాన్ని ఆదా చేసింది. వివిధ ఏజెన్సీల నుంచి అందిన నివేదికలను కంపైల్ చేశారు. కమీషన్ చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఎక్సైజ్‌లతో కూడా సమీక్షలు నిర్వహించింది ఈసీ.ఇటు అన్ని రాష్టాల కంటే తెలంగాణలోనే నగదు ఎక్కువగా జప్తు అవుతోంది. లిక్కర్‌ సీజ్‌లో కూడా తెలంగాణ టాప్‌లో ఉంది. మద్యప్రదేశ్‌లో రూ.69.85 కోట్ల విలువ చేసే మద్యం సీజ్‌ అవ్వగా.. ఇటు తెలంగాణలో 86.82 కోట్ల లిక్కర్‌ను సీజ్ చేశారు. ఇక డ్రగ్స్‌ సీజ్‌లో కూడా తెలంగాణనే టాప్‌లో ఉంది. ఇక్కడ ఏకంగా రూ.103 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను సీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *