నిజామాబాద్ ,(సిరా న్యూస్);
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని.. అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ ఒకటే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నల్లచట్టాలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. ‘‘నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు.. నాకు ప్రభుత్వ ఇంటిని తొలగించారు’’ అని అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌తో ఎమ్మెల్యేకు భూములు అప్పగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.రాహుల్ ఇంకా మాట్లాడుతూ… దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.