సిరా న్యూస్, జోగులాంబ గద్వాల
*జీతాలు లేక వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నఉద్యోగులు*
*జీతాలు విడుదల చేయకపోవడం దుర్మార్గం*
*జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్
గద్వాల*
వీఆర్ఏలను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇతర డిపార్ట్మెంటులకు సర్దుబాటు చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగైదు నెలలు కావస్తా ఉన్న జీతాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ అన్నారు. శనివారం గద్వాల లో మీడియా తో మాట్లాడుతూ జీతాలు లేక కుటుంబాన్ని పోషణకు మరియు ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళుటకు చార్జీలకు డబ్బులు లేక కూడా కొందరు వీఆర్ఏలు తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంతున్నర్ని ఆందోళన వ్యక్తం చేసారు. కొందరైతే మరికొందరు అప్పులు తీసుకొని జీతాలు లేక తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారని తట్టే మహేష్ ఆవీదన వ్యక్తం చేసారు. అదేవిధంగా కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలు మా కుటుంబమే అని ఆ కుటుంబానికి పెద్ద సీఎం కేసీఆర్ అని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు కదా అని గుర్తు చేస్తూ మరి నాలుగైదు నెలలుగా ఈ వీఆర్ఏలకు జీతాలు లేక ఇబ్బందులు పడతా ఉంటే తెలంగాణకు పెద్ద దిక్కు అయినటువంటి సీఎం కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాబట్టి ప్రభుత్వానికి వీఆర్ఏలపైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే వీఆర్ఏలకు జీతాలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన ఏఈ డి ఈ, అదే విధంగా కలెక్టర్ స్పందించి వాళ్లకు ఐడి నెంబర్ ఇవ్వగలరని తట్టే మహేష్ డిమాండ్ చేశారు.