చిత్తూరు,(సిరా న్యూస్);
చిత్తూరులో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి కి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు పోలీసులు అరెష్టు చేశారు.వారి నుండి పదిహేడు లక్షల రూపాయల విలువ కలిగిన 440 గ్రాముల చోరీ చేసిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కారులో బంగారు వస్తువులను చోరీ చేశారని భాదితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెష్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.