సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు
సిరా న్యూస్,ఖమ్మం ;
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సన్ స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్‌కు మాత్రం డాటర్ స్ట్రోక్ అంటూ కామెంట్స్ చేశారు. మంగళవారం రఘునాథపాలెం మండలం బాలపేటలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారాయణ పాల్గొని ప్రసంగించారు. లిక్కర్ స్కాం వల్ల బీజేపీకి కేసీఆర్ తలొగ్గారన్నారు. కేసీఆర్ తుమ్మ ముళ్ళు వ్యాఖ్యలు చేశారు కానీ తుమ్మల తులసి మొక్క లాంటోరని అన్నారు. ఖమ్మంలో పోటీ తులసి మొక్కకు గంజాయి మొక్క మధ్య అంటూ వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ అజయ్ గంజాయి మొక్క లాంటోడని.. పువ్వాడకు సీపీఐ పార్టీ ఓట్లు వేయదని అందుకు తనది గ్యారంటీ అని స్పష్టం చేశారు. తుమ్మల నలభై ఏళ్లుగా పరిచయమన్నారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా.. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంకు చెంపపెట్టు అని సీపీఐ నేత అన్నారు.