హైదరాబాద్,(సిరా న్యూస్);
అంబర్పేట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ స్వామి అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికి ఆయురారోగ్యాలతో ప్రసాదించమని కోరుకున్నారు. అనంతరం అక్కడి గురుస్వాములు కాలేరు వెంకటేష్ కి ఆశీర్వచననం చేశారు. అనంతరం ప్రచారంలో భాగంగా అంబర్ పేట డివిజన్ చెన్నారెడ్డి నగర్ ప్రేమ్ నగర్ లో కాలేరు వెంకటేష్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లు ఎక్కడకు వెళ్లిన పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో బ్రహ్మరథం పడుతున్నారని అభివృద్ధిని చూసి ఓటు వేస్తామని చెప్పారని ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట్ అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు అంబర్పేట్ లో డిపాజిట్ కూడా రాదని అన్నారు.