అంబేద్కర్ ను కులమతాలకతీతంగా అందరూ గౌరవించాలి

సిరా న్యూస్ తలమడుగు:

అంబేద్కర్ ను కులమతాలకతీతంగా అందరూ గౌరవించాలి

మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కూలే…

భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కులమతాలకతీతంగా అందరూ గౌరవించాలని. అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. బాబాసాహెబ్ జయంతిని పురస్కరించుకొని తలమడుగు మండలం ఖోడద్ లోగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న విభిన్న కులాలు మతాలు భాషలను దృష్టిలో ఉంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని. ఆయన రాసిన రాజ్యాంగ రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. బాబాసాహెబ్ ఒక కులానికో మతాన్ని కో చెందిన వాడు కాదని ఆయన అందరివాడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *