అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని జనసేన డిమాండ్
గోనెగండ్ల,(సిరా న్యూస్)
అక్రమ ఇసుక ఎర్రమట్టి తవ్వకాలు యదేచ్చగా రవాణా చేస్తున్న వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకొని వారికి అడ్డుకట్ట వేయడం లేదని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు, జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజక వర్గ ఇంఛార్జి రేఖగౌడ్ ఆదేశాల మేరకు గోనెగండ్ల జనసేన పార్టీ నాయకులు తహశీల్దార్ వేణు గోపాల్ కు వినతి పత్రం అందజేశారు, అనంతరం నాయకులు గానిగ బాషా మాట్లాడుతూ గత నెల రోజులుగా గోనెగండ్ల పరిధిలోని బాపురం కొండల్లో పట్టపగలు ఎర్రమట్టి తవ్వకాలు చేస్తూ హంద్రీనది వంకలో అర్థరాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు, సామాన్యులకు అందని ఖరీదైన ఇసుక కొందరికి సంప్రదిస్తే అందడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు, అధికారుల అనుమతులు లేకుండానే కొండ ప్రాంతాలను ఇష్ట రాజ్యాంగ త్రవ్వకాలు జరిపి గోనెగండ్ల నుంచి చుట్టూ పరిసర గ్రామాలకు ఎర్రమట్టిని యదేచ్చగా రవాణా చేస్తున్నారని తెలిపారు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల కనుసన్నల్లోనే ఇలా జరగడం దారుణమని ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక ఎర్రమట్టి తవ్వకాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు లేనిచో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఖాసిం సాహెబ్, మాలిక్, సుభాన్, వెంకటేష్, మల్లికార్జున, మునాఫ్,ఇబ్రహీం, లక్ష్మన్న, పాల్గొన్నారు.