సిరా న్యూస్, తలమడుగు:
అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్..
బ్లూ భీమ్ యూత్ మండల అధ్యక్షుడు ప్రేమెందర్.
తలమడుగు మండల కేంద్రము లో బ్లూ భీమ్ యూత్ ఆధ్వర్యం లో అంబేడ్కర్ 133 వా జయంతి నీ ఘనంగా నిర్వహించారు.ఊరి ప్రధాన విధుల గుండ అంబేడ్కర్ చిత్ర పటం తో ఊరేగించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రేమెందర్ర్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచపు నలుమూల తెలిసిన మహాపురుషుడు, పేద ప్రజల జీవితాల్లో వెలసిన వెలుగు చుక్క,ఈ దేశాన్ని ప్రజాస్వామ్య లోకి తీసుకువచ్చిన ప్రజల మనిషి అంబేడ్కర్ అని.జయంతి అంటే కేవలం పూలమాల వేసి పులకించిపోవడం కాదు ఈ దేశం లో అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ఆయన కలలు కన్న సమాజం కోసం ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు మనం ఇచ్చే విలువ నిజమవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, చింటు, ఆశాన్న, ప్రసాద్, రాజు, శివ, సంతోష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు